Site icon vidhaatha

పురుగులమందు డబ్బాతో చెట్టెక్కిన రైతు … తన భూమి సమస్య తీర్చాలని విన్నపం

విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ ఓ..రైతు చెట్టు ఎక్కిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడు భూక్య బాలు చెప్పిన వివరాల ప్రకారం పెద్దనాగారం గ్రామపంచాయతీ పరిధిలోని హజ్ తండకు చెందిన తనకు రెండు ఎకరాల భూమి ఉండగా తన భూమిని భూక్య హరిలాల్,భద్రు ల పేరిట పట్టా చేయడంతో తాను సర్వేకు అప్లై చేసుకొనగా సర్వేయర్ వచ్చి సర్వే చేసే క్రమంలో అడ్డు తగిలినట్లు తెలిపాడు.

తన భూమిని తనకి ఇప్పించాలంటూ ఎన్నోసార్లు తహశీల్దార్ కు విన్నవించుకున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు తన భూమిని తన పేరిట చేయకపోవడంతో తనకు అన్యాయం జరుగుతుందని బాధితుడు బాలు తెలిపాడు. ఈ సంఘటన పై తహశీల్దార్ నాగరాజు స్పందించారు. సర్వేయర్ వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలియ చేయనున్నట్లు తెలిపాడు. తహశీల్దార్, పోలీసులు భూ సమస్యను పరిష్కరించుతామంటూ రైతుకు హామీ ఇవ్వడంతో చెట్టుపైనుండి కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version