Site icon vidhaatha

TG | నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల బాలుడు

విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) హాస్టల్లో ఉంటూ చదువుతుండగా వేసవి సెలవులకు ఇంటివద్దకు వచ్చాడు. గురువారం తండ్రి బాలునికి హెయిర్ కటింగ్‌ చేయించాడు. ఇష్టం లేని హెయిర్ కటింగ్ ని చేయించిండని హర్షవర్ధన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.శుక్రవారం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించిందీ. చిన్న విషయానికి పిల్లలు మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version