మహబూబాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

  • By: sr    news    Apr 25, 2025 7:27 PM IST
మహబూబాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

విధాత: మహబూబాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ డి.ఎస్.పి రమేష్ బృందంతో తనిఖీలు చేపట్టారు. రూ.3కోట్ల మేరకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. మహబూబాబాద్, జమ్మికుంట, హైదరాబాద్ లో గౌస్ పాషా బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలతో గౌస్ పాషాను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు.