ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హనుమకొండ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ డీఈవో వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండ అడిషనల్ కలెక్టర్, జిల్లా ఇంచార్జ్ డీఈవో వెంకట్ రెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. శుక్రవారం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీడీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ గా ఉంటూనే ఇంచార్జ్ డీఈవో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొత్తూరు హైస్కూల్ కు అనుమతి పునరుద్ధరణకు ఆయన లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని సంప్రదించారు. ఈ మేరకు ముందస్తు పథకం ప్రకారం రూ. 60వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. వెంకట్ రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram