Formula E Race | ఐఏఎస్ అర్వింద్ కు ఏసీబీ నోటీసులు

Formula E Race | ఫార్ములా ఈ రేసు కేసులో జూలై 1వ తేదీన విచారణకు రావాలని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) నోటీసులు పంపించింది. అర్వింద్ కుమార్ తన ఏకైక కుమార్తె కాన్వొకేషన్ కోసం వెళ్లేందుకు జూన్ 30వ తేదీ వరకు సెలవు పెట్టి యూరప్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కనీసం సమాచారం ఇవ్వకుండా మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయనకు దీర్ఘకాలిక సెలవు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 8 గంటల పాటు విచారించారు. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలపై మరోసారి విచారించేందుకు జూలై 1న రావాల్సిందిగా అర్వింద్ కు నోటీసులు ఇచ్చారు.