Mahindra Thar | రోడ్డు ప్రమాదాల (Road Accident)పై ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. హైవేలపై అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వారు ప్రమాదాల బారిన పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదాల అంచుకు నెడుతున్నారు. తాజాగా ఉత్తరభారతంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మహీంద్రా థార్ వాహనం (Thar Car) అతివేగంగా వెళ్తూ ఏకంగా హైవేపై ఉన్న ఎగ్జిట్ సైన్‌బోర్డు (Signboard)లోకి దూసుకెళ్లిపోయింది. అనంతరం అక్కడే ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఢిల్లీ-గురుగ్రామ్ (Delhi-Gurugram) జాతీయ రహదారిపై జైపూర్ ఎగ్జిట్ 22 వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. అదేలా సాధ్యం..? థార్ వాహనం అక్కడికి ఎలా వెళ్లింది..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమైన వీడియోనేనా..? లేక ఏఐ ద్వారా సృష్టించారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
థార్.. స్టేటస్ సింబల్..
కాగా, మార్కెట్‌లో ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నా.. మహీంద్రా సంస్థకు చెందిన థార్ (Thar) వాహనాన్నే నేటితరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. థార్‌తో రోడ్లపై విన్యాసాలు చేస్తూ ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఇక థార్ నడిపే వాహనదారులను ఉద్దేశించి హర్యాణా డీజీపీ (Haryana DGP) ఓపీ సింగ్ (OP Singh) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అన్ని వాహనాలనూ తనిఖీ చేయరని.. థార్, బుల్లెట్ వాహనాలను మాత్రం వదిలిపెట్టమని పేర్కొన్నారు. వాహనం ఎంపిక వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. థార్‌తో విన్యాసాలు చేస్తున్నారని.. అదో స్టేటస్ సింబల్‌గా మారిందంటూ చెప్పుకొచ్చారు
जयपुर शहर में दिल दहलाने वाला हादसा!
तेज़ रफ्तार में दौड़ती थार अचानक उछलकर सड़क किनारे लगे बड़े बोर्ड से टकरा गई। pic.twitter.com/KDpeqKVSHx
— bahadur khan (@Voicemoriya007) February 19, 2026
ఇవి కూడా చదవండి :
KTR Open Letter To Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
GHMC Trifurcation : జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్
