• Telugu News
  • /Telangana

KTR Open Letter To Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

ఎన్నికల హామీల అమలు కాలేదంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈసారి బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలు సహా అన్ని వాగ్దానాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 19, 2026, 4:24 pm IST
Read Time: 5 mins
KTR Open Letter To Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కాలం కావస్తుందని..దాదాపు సగం పదవీ కాలం పూర్తయిన ఎన్నికల హామీలను అమలు చేయలేదంటూ లేఖలో కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో.. ఈ సారైన బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని, లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలను పక్కన పెట్టారన్న కేటీఆర్ ఆరోపించారు. రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం కేటాయింపులు చేయని ప్రభుత్వం… ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని, డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయా వర్గాలకి రెండు సంవత్సరాలుగా ఎగగొట్టిన హామీలను…కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన నిధుల బకాయిలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలన్నారు.

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాని నిలబెట్టుకోవాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈసారి కూడా హామీల అమలకు నిధులు కేటాయించకుంటే ప్రజల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం అన్నారు. 2026-2027 బడ్జెట్‌లో 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ను ప్రజలపక్షాన నిలదీస్తామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి :

Mrunal Takhur | హ్యాండ్సమ్ హీరోలతో సినిమాలు.. అసూయతో బరువు తగ్గిన మృణాల్ ఠాకూర్ మాజీ ప్రియుడు
మేడారం జాతరకు మేం వస్తాం: మంత్రి సీతక్కతో ఖర్గే, రాహుల్