Mrunal Takhur | హ్యాండ్సమ్ హీరోలతో సినిమాలు.. అసూయతో బరువు తగ్గిన మృణాల్ ఠాకూర్ మాజీ ప్రియుడు
Mrunal Takhur | ఇటీవల రిలేషన్‌షిప్ కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఓ వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టింది. హ్యాండ్సమ్ హీరోలతో తాను సినిమాలు చేయడంతో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అసూయ, అభద్రతా భావంతో బరువు తగ్గాడని వెల్లడించింది.
Mrunal Takhur | ఇటీవల రిలేషన్‌షిప్ కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఓ వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టింది. హ్యాండ్సమ్ హీరోలతో తాను సినిమాలు చేయడంతో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ అసూయ, అభద్రతా భావంతో బరువు తగ్గాడని వెల్లడించింది. మృణాల్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన ‘దో దీవానే సెహర్ మే’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘రిలేషన్ షిట్ అడ్వైజ్’ అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిలేషన్‌షిప్‌లలో అసూయ, ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడిన మృణాల్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంది.
హృతిక్, షాహిద్‌లతో సినిమాల తర్వాత…
“నా కెరీర్ స్టార్టింగ్‌లో నేను హృతిక్ రోషన్ Hrithik Roshanతో, ఆ తర్వాత షాహిద్ కపూర్ Shahid Kapoorతో సినిమాలు చేశాను. అప్పుడు నా బాయ్‌ఫ్రెండ్ చాలా అసూయ పడేవాడు. నేను అందమైన హీరోలతో షూటింగ్ చేస్తున్నానని భావించి ఇన్‌సెక్యూరిటీకి లోనయ్యాడు” అని మృణాల్ తెలిపింది.
తన మాజీ ప్రియుడు స్కాండినేవియన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వెల్లడించిన ఆమె, “నాకు నచ్చాలంటే కండలు పెంచుకోవాలనుకుని జిమ్ చేసి 15 కేజీలు తగ్గాడు. కానీ తర్వాత జిమ్ మానేసి 20 కేజీలు పెరిగాడు. నేను ఎప్పుడూ బరువు తగ్గమని చెప్పలేదు. కండలు ఉన్న వ్యక్తితోనే డేటింగ్ చేయాలనుకోలేదు. అతనే అభద్రతా భావంతో అలా చేశాడు” అని చెప్పింది.
ఆ సినిమాల వివరాలు
మృణాల్ 2019లో విడుదలైన సూపర్ 30లో హృతిక్ రోషన్‌తో కలిసి నటించింది. అలాగే 2022లో వచ్చిన జెర్సీలో షాహిద్ కపూర్ సరసన కనిపించింది. ఈ సినిమాల సమయంలోనే తన రిలేషన్‌షిప్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె సూచించింది. ఇదే షోలో సిద్ధాంత్ చతుర్వేది కూడా తన కాలేజీ రోజుల్లో రిచ్ గర్ల్స్‌ను చూసి తాను జెలస్ ఫీల్ అయ్యేవాడినని, తాను ఇష్టపడ్డ అమ్మాయి కూడా ధనిక కుటుంబానికి చెందినదేనని చెప్పాడు.
మృణాల్‌పై డేటింగ్ రూమర్లు
ఇటీవల మృణాల్ ఠాకూర్ వ్యక్తిగత జీవితంపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో ధనుష్Dhanushతో ఆమె డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మృణాల్ ఇప్పటికే స్పష్టం చేసింది.
వ్యక్తిగత జీవితంపై వచ్చే ఊహాగానాల మధ్య కూడా కెరీర్‌పై ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్న మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె చేసిన తాజా కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram