Nalgonda | గూడ్స్ రైలు కింద పడి ఇద్దరి ఆత్మహత్య

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామం దుర్గానగర్ వద్ద గురువారం గూడ్సు రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు

  • Publish Date - May 30, 2024 / 12:36 PM IST

విధాత : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామం దుర్గానగర్ వద్ద గురువారం గూడ్సు రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లక్ష్మి (24), దుర్గా ప్రసాద్ ఇవాళ ఉదయం మండల పరిధిలోని బలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కాగా.. వారిద్దరు ఇదే ప్రాంతానికి చెందిన వారని తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పట్టాల పైనుంచి తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ల ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest News