Site icon vidhaatha

ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్

విధాత, హనుమకొండ: ఏసీబీ దాడుల్లో రాష్ట్రంలో వరుసగా అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గతంలోనూ తహసీల్ధార్‌ మాధవిపై పలు అవినీతి ఆరోపణలున్నాయి.

సిరిసిల్ల పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలోనూ ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 7వేల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్‌రావు ఏసీబీకి చిక్కారు. స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్‌ను భాస్కర్‌రావు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో వెంకటేశ్ ఏసీబీని ఆశ్రయించాడు.

Exit mobile version