విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరు పరిసరాలను అభివృద్ధి చేయాలని, యాదాద్రి దివ్య క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులను ఆకర్షించేలా, చూడదగిన ప్రదేశంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని ఆదేశించారు.
బుధవారం ఆమె జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డితో కలిసి రాయగిరి దేవాలయ పరిసరాలను, కోనేరును పరిశీలించారు.
కోనేరు పరిసరాలు శుభ్రం చేసి పూల మొక్కలతో అందమైన పార్క్ ఏర్పాటు చేయాలని, స్నానపు గదులు, టాయిలెట్స్, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, వచ్చే సంక్రాంతి వరకు పనులు పూర్తి చేయాలని సూచించారు.