పోడు భూముల రక్షణకు చర్యలు

వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా అడవులను ఆక్రమించి భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది.

  • Publish Date - June 15, 2024 / 03:23 PM IST

అటవీశాఖ మార్గదర్శకాల అమలుకు శ్రద్ధ

పోడు భూముల పంపిణీ పై నివేదిక

అటవీశాఖ, రైతుల మధ్య ఘర్షణ నివారణ లక్ష్యం

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు సురేఖ, సీతక్క

విధాత ప్రత్యేక ప్రతినిధి:

వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా అడవులను ఆక్రమించి భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, అడిషనల్ సెక్రెటరీ ప్రశాంతి, డిప్యూటీ సెక్రెటరీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలుగకుండా, అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అధికారులు పోడు భూముల రక్షణకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. అదే సమయంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, ఆపై క్రమశిక్షణ చర్యలకు గురికావద్దని హెచ్చరిక చేశారు.

– నిబంధనల మేరకు పోడు భూములు

పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతుల హక్కులను కాపాడడంలోనూ, అటవీశాఖ భూములను కాపాడే విధులను నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్ళుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకున్నట్లైతే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి సురేఖ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీ పై నివేదికను సమర్పించాలని మంత్రి సురేఖ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

– ఇరువురి మధ్య ఘర్షణ నివారణ లక్ష్యం

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, “ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెదకాలని మంత్రి సీతక్క నాతో పలుమార్లు ప్రస్తావించారు. పోడు భూముల విషయంలో అటవీశాఖకు, రైతులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలను నివారించేలా చర్యలు చేపట్టాలని, మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ వచ్చారు. వీరి మధ్య జరిగే సంఘర్షణలతో ప్రభుత్వానికి మచ్చ రావద్దనే ఆలోచనతో ఈ సమస్యలకు పరిష్కారం వెదికేందుకు ప్రాథమికంగా నేడు సమావేశమయ్యామని తెలిపారు.

– అభివృద్ధికి నిబంధనలు ఆటంకం: సీతక్క

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని ఆమె ప్రస్తావించారు. ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో.. రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పోడు రైతుల హక్కులను కాపాడటంలోనూ, అదే సమయంలో అటవీశాఖ భూములను కాపాడే అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు.

వారిపై ఫైరింగ్‌ చేయవద్దు

ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య సుర్షణల వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫైరింగ్ చేయొద్దని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం అటవీ అధికారులతో సమావేశమైన సీతక్క అర్హులైన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని, పోడు పట్టాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఆదివాసీలు, అటవీ సిబ్బంది మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూడాలన్నారు. అటవీ చట్టాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించాలని సూచించారు. చేతుల మారిన పోడు భూములపై విచారణ చేపడుతామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పోడు భూముల పై వివాదాలను చూస్తూనే ఉన్నానని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు

Latest News