విధాత : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ శనివారం రాష్ట్ర, రోడ్లు భవనాలు, సినీమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశారు. తాను నటిస్తున్న సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ ఆహ్వానించారు. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డిపై అద్దంకి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొంతకాలం వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరన్నట్లుగా అనంతర కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిణామాల్లో భాగంగా వారిద్ధరూ కలిసిపోయారు. తాజాగా తన సినిమా ఆడియో లాంచ్‌కు రావాలని కోమటిరెడ్డిని అద్దంకి ఆహ్వానించడం అందుకు ఆయన సానుకూలంగా స్పందించడం విశేషం.
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన అద్దంకి దయాకర్ … సినిమా ఆడియో లాంచ్‌కు ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ శనివారం రాష్ట్ర, రోడ్లు భవనాలు, సినీమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశారు. తాను నటిస్తున్న సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ ఆహ్వానించారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు