విధాత, జనగామ :
నివారణ తప్ప చికిత్స లేని ఎయిడ్స్ వ్యాధిని అవగాహనతో అరికట్టి ఆమడ దూరం తరిమికొట్టవచ్చునని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జనగామ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ అన్నారు. సోమవారం జనగామ తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ఎయిడ్స్ డే సందర్భంగా ప్రిన్సిపాల్ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోగ నిరోధక శక్తిపై దాడి చేసే హెచ్‌ఐవీ విచ్చలవిడి శృంగారం వల్ల సంక్రమిస్తుందన్నారు. వ్యాధిపై అవగాహన పెంచుకుని, నిగ్రహశక్తి కలిగి ఉండాలని కోరారు.
యూనియన్ ఉపాధ్యక్షుడు జి.కృష్ణ హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై మాట పాటతో అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎయిడ్స్‌పై నిర్వహించిన వ్యాస రచన పోటీలోని విజేతలైన పి.మణికంఠ గౌడ్ (ప్రథమ), ఇరుగు అక్షిత్ (ద్వితీయ ), బి.వికాస్ (తృతీయ)కు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ పి.అనిల్ బాబు, యూనియన్ గౌరవ అద్యక్షులు ఎం.శివకుమార్, ప్రధాన కార్యదర్శి గన్ను కార్తీక్, కార్యనిర్వహణ కార్యదర్శులుగా తుంగ కౌశిక్, కోశాధికారి కొన్నె ఉపేందర్, సభ్యులు అప్రోజ్, ఓంకార్, అయిలా నర్సింహచారి, ఉపాధ్యాయులు పెట్లోజు సోమేశ్వరాచారి, ఉపాధ్యాయులు సైదులు, సందీప్, సల్మాన్, శంకరాచారి,మహేందర్ పాల్గొన్నారు.
