Site icon vidhaatha

SAY NO TO NEP । నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోరుతూ అసెంబ్లీ తీర్మానించాలి : ఏఐఎస్‌ఎఫ్‌

SAY NO TO NEP । నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ  అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని విఫలం చేసిన పోలీసులు ఏఐఎస్ఎఫ్ నాయకులను సుమారు 50 మంది పైగా పోలీసులు అరెస్ట్ చేసి అంబర్‌పేట, ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

నూతన జాతీయ విద్యా విధానం వలన పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రను చేస్తున్నారని వారు ఆరోపించారు. మతతత్వ భావజాలాన్ని విద్యార్థులపై రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసేంతవరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
Exit mobile version