విధాత ప్రతినిధి, నిజామాబాద్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పేద మహిళలు, బీడీ కార్మికులకు మంగళవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీడీ కార్మిక సంఘం నాయకులు ఏఎస్ పోశెట్టి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోశెట్టి మాట్లాడుతూ ఉద్యమ కాలం నుంచి కూడా మహిళలకు బతకమ్మ పండుగ ను పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని, నిరుపేదలకు పండగ సమయంలో తోబుట్టువులకు చీరలు పంపిణీ చేస్తానని అన్నారు. ఈసందర్భంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నలాగా బతుకమ్మ పండుగకు పోశెట్టి అన్న చీరలు పంపిణీ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.