విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజల సేవకోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బాలస్వామి అన్నారు. శనివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అధికారులు, ఇతరులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ లు బాధితులకు అండగా ఉండి సహహాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరినీ మర్యాద పూర్వకంగా ఆహ్వానించి, తగు సేవలు అందించి, నమ్మకము కలిగేలా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాలు, అక్రణ కార్యకలాపాలు,రోడ్ ప్రమాదాలు మొదలైన వాటి పై ప్రత్యేక దృష్టి పెడుతామని అన్నారు.