Site icon vidhaatha

భువ‌న‌గిరి గ‌డ్డ కాంగ్రెస్ అడ్డా: ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి

ఆప‌దొచ్చినా, సాప‌దొచ్చినా అండాగా ఉంటాం

విధాత‌: భువ‌న‌గిరి గ‌డ్డ‌ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిని గెలిపించ‌డం భువ‌నగిరి ప్ర‌జ‌ల‌పై ఉంద‌న్నారు మునుగోడు ఎమ్మెల్యే, భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ఇంచార్జీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. శుక్ర‌వారం ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ముఖ్యకార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంధ‌ర్బంగా రాజ‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. గ‌త 20 సంవ‌త్సారాల నుంచి యూత్‌కాంగ్రెస్‌లో ఏ ప‌ద‌వి లేకుండా పార్టీ కోసం క‌ష్టప‌డ్డ యువ‌కుడు చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింద‌న్నారు. భువనగిరి పార్లమెంట్‌లో కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేటోళ్లు పనిచేయర‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు మతాలను ఆదరిస్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రాణం పోయిన వెనక్కి పొడని, తన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని కూడా ప్రచారంలో దించుతానని కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే నా పోరాటమ‌న్నారు. ప‌దేళ్ల‌గా ఆగ‌మైన తెలంగాణ‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడిప్పుడే దారికి తెస్తున్నార‌న్నారు. కేసీఆర్‌ పదేళ్లు మాయమాటలతో పరిపాలించి చిప్ప చేతికిచ్చిపోయాడన్నారు. ఆలేరు నియోజకవర్గం లో కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత మాది.ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవరకు నిద్రపోమన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా మేము ఇద్దరం అన్నదమ్ములుగా సేవ చేస్తాం, ఆపదొచ్చిన సాపద వచ్చినా ఏ సమయంలో నైనా పేదోళ్లకు మేము సహాయం చేస్తాము, రాత్రి పగలు కష్టపడతాం, కార్య‌క‌ర్త‌ల‌ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామ‌న్నారు.

Exit mobile version