Site icon vidhaatha

నేడు ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ ధర్నా

ఫోన్‌ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలకు డిమాండ్

విధాత : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. కేసీఆర్‌ ఆదేశాలతోనే ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని ఫైర్‌ అయ్యింది. ఫోన్‌ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో బయటపడుతున్న గత ప్రభుత్వ కుంభకోణాలపై సీబీఐతో దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుంభకోణాలను అడ్డు పెట్టుకుని బీఆరెస్‌ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణలో ప్రతి వారం ఒక్కో కుంభకోణం వెలుగులోకి వస్తోందని, వాటిపై చర్యలు మాత్రం ఉండటం లేదన్నారు.

Exit mobile version