Site icon vidhaatha

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను తొలి ముద్దాయిగా చేర్చాలి

phone-tapping

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కేటీఆర్ ని మొదటి ముద్దాయిగా విచారణ చేయాలని బీజేపీ నేత ఎస్ వీవీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు

బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్

విధాత, హైదరాబాద్‌ : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు కేటీఆర్ ని మొదటి ముద్దాయిగా విచారణ చేయాలని బీజేపీ నేత ఎస్ వీవీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అప్పటి డీజీపీ చెబితే చేశారా..? అనాటి సీఎం చెబితే చేశారా అని ప్రశ్నించారు. బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే వాళ్లంతా కేసీఆర్, కేటీఆర్ చెబితేనే వెలుతున్నారన్నారు. కాళేశ్వరంపై విచారణ అపారని, దీని వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు.

కాళేశ్వరం అక్రమాలపై విచారణ తక్షణమే ముందుకు కొనసాగించాలని, ఉచిత గొర్రె స్కీంపై సైతం విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రులు బీఆరెస్ పదేళ్లలో అక్రమాలపై విచారణ జరిపిస్తామని, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పి వంద రోజుల్లో ఏ ఒక్క విచారణ పూర్తి చేయలేదు ఎందుకో ప్రజలకు చెప్పాలన్నారు. 100 రోజుల్లో ఏ స్కీం ఇంప్లిమెంట్ చేశారో సీఎం రేవంత్ రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు. బీఆరెస్‌ భవిష్యత్తు లేకనే నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు.

Exit mobile version