ఆసక్తి రేపుతున్న మూడు పార్టీల బ్లాక్ లిస్టు డిమాండ్
విధాత, హైదరాబాద్ : సుంకిశాల పంప్‌హౌజ్ కూలిన ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆరెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ ఘటనకు మీరంటే మీరే బాధ్యులని..తప్పు మీదంటే మీదేనంటూ పరస్పరం కాంగ్రెస్, బీఆరెస్ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రమాదంపై విచారణ జరిపించి నిజాలు తేల్చాలని బీఆరెస్ సవాల్ విసిరగా.. విచారణ జరిపిస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు పేర్కోన్నారు.
సుంకిశాల ప్రమాదం జరిగిన వారం రోజులకు కూడా ప్రభుత్వానికి నిజంగా సమాచారం లేదా.. ఉద్ధేశపూర్వకంగా ఘటనను దాచిపెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. సమాచారం లేకపోయినా పరిపాలన వైఫల్యమే అంటూ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్ళల దాడి చేశారు. నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సుంకిశాల ఘటనపై చర్యలేవంటూ బీఆరెస్ పార్టీ ట్వీటర్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించింది. నిర్మాణ సంస్థ మేఘాను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని నిలదీసింది.
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో కూలిపోయిన సుంకిశాల రిటైనింగ్ వాల్ అని ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేస్తూ.. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా..అయ్యా రేవంత్ రెడ్డి.. సుంకిశాల ఘటన జరిగి వారం రోజులు దాటినా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారు? అని ప్రశ్నించింది. అంతేగాక ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టడం లేదు? అని నిలదీసింది. ఇక సుంకిశాల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
అయ్యా రేవంత్ రెడ్డి.. సుంకిశాల ఘటన జరిగి వారం రోజులు దాటినా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారు?
ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టడం లేదు?
సుంకిశాల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని… pic.twitter.com/ycXUxKxBhU
— BRS Party (@BRSparty) August 11, 2024
కాళేశ్వరం ప్రాజెక్టులోనూ మేఘా సంస్థనే కీలకంగా ఉండగా పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఆ సంస్థపై కీలక ఆరోపణలు చేయడంతో పాటు ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. మేడిగడ్డ ఘటన సందర్భంగా కూడా మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం గుత్తెదారులతో కలిసి వేలకోట్ల కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టును కూడా మేఘా సంస్థనే గుత్తెదారుగా ఉన్నందునా ఇప్పుడేందుకు మీరు బ్లాక్‌లిస్టులో పెట్టడం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆరెస్ ప్రశ్నిస్తుంది.
అటు బీజేపీ సైతం మేఘా సంస్థను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. బీఆరెస్, బీజేపీల మధ్య మేఘా కృష్ణారెడ్డి సెటిల్మెంట్లు చేస్తున్నాడని తాజాగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. నిజానికి జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రభుత్వాల పరిధిలో కూడా మేఘా సంస్థ పలు కాంట్రాక్టు పనులు చేస్తుంది. ఇలా మూడు పార్టీల ముఖ్య గుత్తేదారు సంస్థగా మేఘా కొనసాగుతుంది. ఈ నేఫథ్యంలో మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలన్న వ్యహారంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్‌ల మాటల యుద్దం చూస్తే అంతా శాఖహారులే గాని కోడి మయమైందన్న సామేతను తలపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.