వంద రోజుల్లో తెలంగాణ ఆగం: మన్నె శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ల సహకారం తో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది మా అధినేత కేసీఆర్‌ బహుమతి గా ఇస్తానని మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

  • Publish Date - April 25, 2024 / 02:53 PM IST

వంద రోజుల్లో కాంగ్రెస్ పని అయిపోయింది
కరెంట్ సక్రమంగా సరఫరా లేక పంటలు ఎండిపోయాయి
కేసీఆర్‌ అధికారంలో ఎకర పంట ఎక్కడా ఎండిన దాఖలాలు లేవు
ఇప్పడు ఎన్నికలు జరిగినా ప్రజలు కేసీఆర్‌కే పట్టం కడతారు
మహబూబ్‌నగర్ ఎంపీగా గెలుపొంది కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తా
మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్
బీఆర్ఎస్‌ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ల సహకారం తో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది మా అధినేత కేసీఆర్‌ బహుమతి గా ఇస్తానని మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో మన్నె శ్రీనివాస్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రవి నాయక్ కు అందజేశారు.

అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిందని, ఉచిత హామీలు ఇచ్చి ప్రస్తుతం నెరవేర్చడం లో పూర్తి గా విఫలం చెందిందని మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్ళీ కేసీఆర్‌ను ముఖ్య మంత్రి అవుతారన్నారు. కేసీఆర్‌ పదేళ్ల అధికారం లో తెలంగాణ ఎంతో అభివృద్ధి లోకి వచ్చిందని,రైతుల కోసం సాగు నీరు, ప్రజల దాహర్తి తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించారన్నారు.

రైతుల పండించే పంటలకు నిరంతరం కరెంట్ సరఫరా చేసి ఎకర పొలం కూడా ఎండిపోకుండా కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారని మన్నె పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండి పోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని మన్నె శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతం లో రైతులకు 24 గంటల నిరంతర కరెంట్ ఇచ్చారని, నేడు కరెంట్ లేక పంటలు ఎండి రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్న సమయం లో రైతుల ఆత్మహత్య లు చేసుకున్నారని, కేసీఆర్‌ ప్రభుత్వం లో ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదని ఆయన తెలిపారు. రైతు బంధు, రుణమాఫి ఇచ్చి రైతులను ఆడుకున్న కేసీఆర్‌ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. తెలంగాణ లో కేసీఆర్‌ అందించిన పరిపాలన దేశం లో ఏ ముఖ్య మంత్రి చేయలేదన్నారు. కేసీఆర్‌ చేసిన ఇంత అభివృద్ధి మన కళ్ళకు కనబడుతున్నాదని, కాంగ్రెస్ ఇచ్చిన మోసం పూరిత హామీలు ప్రజలు నమ్మి అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ను విస్మరించి ఇప్పుడు బాధ పడుతున్నారని మన్నె పేర్కొన్నారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మన్నె శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు తనదే అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి తన సొంత గ్రామం నావాబ్ పేట మండలం గురుకుంట సాయిబాబా ఆలయం కుటుంబ సభ్యుల తో కలిసి మన్నె శ్రీనివాస్ రెడ్డి పూజలు చేశారు.

Latest News