చిదంబరం వ్యాఖ్యలే అస్త్రంగా కాంగ్రెస్‌పై బీఆరెస్ ఫ్లెక్సీ వార్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తాజాగా తెలంగాణ ఉద్యమ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీపైనే విమర్శనాస్త్రాలుగా చేసుకుని బీఆరెస్ ఫ్లెక్సీవార్ సాగిస్తుంది.

విధాత : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తాజాగా తెలంగాణ ఉద్యమ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీపైనే విమర్శనాస్త్రాలుగా చేసుకుని బీఆరెస్ ఫ్లెక్సీవార్ సాగిస్తుంది. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతకనీయవద్దంటూ హైద్రాబాద్ నగరంలో పలుచోట్లలో బీఆరెస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
అలాగే అమరుడు శ్రీకాంత చారి ఫోటోతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పయిన అమరుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేత వ్యాఖ్యలతో ఆ పార్టీపై బీఆరెస్ విమర్శల దాడి చేపట్టడం విశేషం.