Site icon vidhaatha

Padi Srinika Reddy | అధికారం.. పదవి లేకుండా ఐదేళ్లు ఉండలేరా.. ఎందుకు మీకు జంపింగ్‌లు?

సంపుకుంటరా..సాదుకుంటరా ట్రెండ్‌కు మీరే ఆధ్యులు
ఈటల కోడలు క్షమితకు కౌశిక్‌రెడ్డి కూతురు శ్రీనిక కౌంటర్‌

విధాత : ఆంటీ.. ఆంటీ అంటూ ఈటల రాజేందర్ కోడలు క్షమితకు ఘాటు కౌంటర్ ఇచ్చారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక రెడ్డి. తాను స్కూల్ వెళ్లకపోవడంపై క్షమిత చేసిన కామెంట్లపై వీడియో ద్వారా కౌంంటర్ వేశారు. నేను స్కూల్‌కు పోతేంది పోకపోతే మీకేందని, మీరేమైనా నాఫీజు కడుతున్నారా నా పరీక్ష రాస్తున్నారా నా ప్రిన్సిపల్‌నా అంటు శ్రీనిక నిప్పు కణికగా ఫైర్ అయ్యింది. నేను స్కూల్‌కు సెలవు పెట్టాను..అయినా పోకపోతే మా పేరెంట్స్‌కు..నాకు సమస్య.. మీకేం సమస్యంటు మండిపడ్డారు.

మా మామయ్యకు ఓటు వేయలేదని హుజూరాబాద్ ప్రజలు బాధపడుతున్నారని మీరు చాలాసార్లు చెప్పారని.. మీ మామయ్య గురించి చాలాబాగా తెలిసే ఇక్కడి ప్రజలు మా డాడీ కౌశిక్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించారని చురకలేశారు. మీకసలు హుజూరాబాద్ అడ్రస్ తెలుసా…ఎట్లుంటదో తెలుసా..నియోజవర్గంలో ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలుసా..హుజూరాబాద్ బార్డర్ తెలుసా అంటు సెటైర్లు వేశారు. హుజూరాబాద్ మా డాడి, తాతముత్తాతల ఊరు..నా ఊరు అని.. ఇక్కడి ప్రజలంతా నా కుటుంబ సభ్యులు..వారే మా బలం..వారే మమ్మల్ని కాపాడుతారన్నారు.

 

మీ జంపింగ్‌లు ఎందుకూ?

మీరు హుజూరాబాద్ లో ఓడితే గజ్వేల్‌లో పోటీ చేస్తారని..అక్కడ ఓడితే మల్కాజిగిరిలో పోటీ చేస్తారని ఎందండీ.. ఈ జంపింగ్ జాగ్ ప్రాసెస్‌ ఎంటో నాకు అర్ధం కావడం లేదన్నారు. మేమైతే ఎప్పుడు చేయలేదని ఎద్దేవా చేశారు. ఎందుకు మీరు ఐదేళ్లు అధికారం, పదవీ లేకుండా ఉండలేకపోతున్నారని ప్రశ్నించారు. మీరు ఇల్లీగల్‌గా తీసుకున్న, ప్రజలకెళ్లి దొంగతనంగా తీసుకున్న భూములను, దేవుడి దగ్గర నుంచి దొంగతనంగా తీసుకున్న భూములను కాపాడుకోవడానికేనా మీకు అధికారం..పదవీ అని నిలదీశారు. మీకు గుర్తుందో లేదోగాని జ్యూస్ బాటిల్ పట్టుకునిపోయి నాకు ఓటు వేయకపోతే నేను తాగి చస్తానని ఈటల తాతయ్య హుజూరాబాద్‌ ప్రజలను అడిగారని, జమునా అమ్మమ్మ అయితే నా తాళిబొట్టు తెంచుతారా ఉంచుతారా అని అడిగిన సంగతి మరువరాదన్నారు.

ఈటల తాతయ్యనే సంపుకుంటారా సాదుకుంటారా అనే ట్రెండ్ స్టార్ట్ చేశారన్నారు. నేను ఎన్నికల ప్రచారంలో మా డాడీ మంచివారని, అభివృద్ధి ఎంతమంచిగా చేస్తారో చెప్పడానికి వెళ్లానని, హుజూరాబాద్ ప్రజలు నన్ను నమ్మి మా డాడికి ఓటు వేశారని, నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలని అనుకోవడం లేదని, ఏదో ఒక రోజు కేసీఆర్ తాతాయ్య మళ్లీ సీఎం అవుతారని, హుజూరాబాద్ ప్రజల కోసం మళ్లీ 1000కోట్లు తెస్తానన్నారు. అంటీ.. నేను మీ లాగా పక్క వాళ్ల మీద కామెంట్లు చేయనని, ఎన్నికల ప్రచారంలో తిరుగనంటూ కౌంటర్ వేశారు. శ్రీనిక కూతురు తన తండ్రి పాడి కౌశిక్‌రెడ్డి గెలుపు కోరుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తల్లితో కలిసి ప్రచారం చేశారు.

డాడీకి ఓటు వేయకపోతే మేమంతా చస్తామని వీడియోతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఎన్నికల్లో ఈటలపై కౌశిక్‌రెడ్డి గెలిచాకా అసెంబ్లీలో ఆయన ప్రమాణం చేస్తుండగా, గ్యాలరీ నుంచి ఐలవ్‌యూ డాడీ అంటూ కేకలేసి హల్‌చల్ చేశారు. తాజాగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు తండ్రీతో పాటు వచ్చి హంగామా చేశారు. ఇప్పుడు ఈటల కోడలుపై ఆంటీ అంటూ ముద్దుముద్దు మాటలతో పోలిటికల్ పంచ్‌లు వేసి పిట్ట కొంచం..కూత ఘనం అనిపించుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version