BRS ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రాల్లో ధర్నాలతో హోరెత్తించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధర్నాలతో నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నా లో జడ్పి చైర్మన్ […]

  • Publish Date - December 23, 2022 / 01:04 PM IST

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రాల్లో ధర్నాలతో హోరెత్తించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ధర్నాలతో నిరసన తెలిపారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నా లో జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్సీ ఎంసి. కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్. రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్.భాస్కర్ రావు, నోముల భగత్, ఫిష్ గోట్ చైర్మన్ బలరాజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గా, ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, శానంపూడి సైదిరెడ్డి , బోల్లం మల్లయ్య , జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు , రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ రజాక్, డీసీఎంఎస్ చైర్మెన్ శ్వట్టే జానయ్య , జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వె.వెంకటేశ్వర్లు , శశిధర్ రెడ్డి , జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట్నారాయణ గౌడ్ , స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ , బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటసీలు, ఎంపిటిసి లు, సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పాల్గొన్నారు.