కేసీఆర్ ప్రచార బస్సులో కేంద్ర బలగాల తనిఖీ

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న ప్రత్యేక బస్సును ఎన్నికల తనిఖీల్లో భాగంగా కేంద్ర బలగాలు సోమవారం కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్ వద్ధ తనిఖీలు నిర్వహించాయి.

  • Publish Date - November 20, 2023 / 08:59 AM IST

విధాత : సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న ప్రత్యేక బస్సును ఎన్నికల తనిఖీల్లో భాగంగా కేంద్ర బలగాలు సోమవారం కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్ వద్ధ తనిఖీలు నిర్వహించాయి.


కేసీఆర్ మానకొండూరు ఎన్నికల ప్రచార సభకు వెలుతున్న క్రమంలో ఆయన బస్సును కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి. ఎన్నికల నిబంధనల మేరకు కేసీఆర్ తనిఖీ బృందానికి సహకరించారు. తనిఖీలు పూర్తకయ్యాక కేసీఆర్ బస్సులో ప్రజాశీర్వాద సభలకు హాజరయ్యేందుకు వెళ్లారు.