చెంచు మహిళ ఈశ్వరమ్మ అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి … విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర శ్రీనివాస్

:తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ ప్రాంతంలో చెంచు మహిళ ఈశ్వరమ్మ మీద అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని విసికె రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

  • Publish Date - June 27, 2024 / 08:02 PM IST

విధాత, వరంగల్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ ప్రాంతంలో చెంచు మహిళ ఈశ్వరమ్మ మీద అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని విసికె రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అమానవీయ అత్యాచారాన్ని నిరసిస్తూ హన్మకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో గురువారం ప్రజా సంఘాల జాక్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొనేలా ఈశ్వరమ్మను వివస్త్రను చేసి, ఆమె మానంమీద పెట్రోల్ పోసి కాల్చిన ఘటన మానవ జాతికే కళంకం అన్నారు. ఆమెకు న్యాయం జరిగే వరకు అందరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ధర్నాలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ ఈశ్వరమ్మకు బిసిలు అండగా నిలుస్తారని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మానవీయ సమాజ నిర్మాణం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు.

కొత్తూరు జాక్ కన్వీనర్‌ క్రాంతికుమార్ మాట్లాడుతూ ఆదివాసుల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా విమర్శించారు. ఈ నిరసన ధర్నాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, టిజెఎస్ జిల్లా అద్యక్షులు చిల్లా రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అద్యక్షులు కన్నం సునీల్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేడల ప్రసాద్, న్యాయవాదులు కూనూరు రంజిత్ గౌడ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, దళిత బహుజన పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ దూడల సాంబయ్య, ట్రైబల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉదయ్ సింగ్ నాయక్, హన్మకొండ జాక్ అధ్యక్షులు తాడిషేట్టి క్రాంతి కుమార్, డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, విసికె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుపెల్లి ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి ఐరబోయిన భిక్షపతి, మహిళా దండు రాష్ట్ర నాయకురాలు సింగారపు అరుణ, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల అర్జున్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రామచందర్ రావు, వివిధ సంఘాల నాయకులు వల్లాల జగన్ గౌడ్, దరిగే శ్రీనివాస్, ప్రకాశ్ బాబు, రమేష్, నాగారం మనితేజ, కమ్మరి సంతోష్, వంగాల సోమయ్య, పోషాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Latest News