Leopard Attack Cop In Kolhapur : రెస్క్యూ టీమ్ పై దాడికి దిగిన చిరుత..వీరోచిత పోరాటం

కొల్హాపూర్‌లో చిరుత రెస్క్యూ టీమ్‌పై దాడికి దిగింది. సిబ్బంది వీరోచిత పోరాటంతో చివరికి చిరుతను బంధించారు. వీడియో వైరల్ అవుతోంది.

Leopard Attack Cop In Kolhapur

విధాత: మహారాష్ట్రలో కొల్హాపూర్ లో జనావాసాల్లోకి వచ్చిన చిరుతను బంధించే ప్రయత్నం చేసిన రెస్క్యూ టీమ్ సిబ్బందిపైనే చిరుత దాడికి దిగిన ఘటన వైరల్ గా మారింది. చిరుతను బంధించేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై చిరుత దాడి చేసింది. ఓ అధికారిపై చిరుత దాడి చేసి మీద పడి గాయపరిచింది. అదృష్టవశాత్తు చేతిలోని ఐరన్ స్టిక్ తో దానిని అడ్డుకోవడంతో అది వెనక్కి తగ్గింది. చిరుతను చూసి మిగతా సిబ్బంది పరుగు లంఘించుకున్నారు. హడావుడిలో చిరుత ఓ డ్రైనేజీ హోల్ లో దూరింది. నెట్ అడ్డుగా పెట్టి దానిని రెస్క్యూ టీమ్ బంధించే ప్రయత్నం చేశారు.

అయితే చిరుత వలలో చిక్కినప్పటికి అందులో నుంచే మరోసారి వారందరిపై దాడికి దిగింది. దీంతో చిరుత తప్పించుకుని మరోసారి దాడికి దిగే అవకాశం ఇవ్వకుండా రెస్క్యూ సిబ్బంది మూకుమ్మడిగా వలలోనే దానిని అదిమిపట్టే ప్రయత్నంలో చిరుతతో వీరోచిత పోరాటమే చేశారు. అతి కష్టం మీద చిరుతను బంధించారు. చిరుతను బంధించేందుకు రెస్క్యూ టీమ్ సాగించిన ప్రయత్నాలు..చిరుత దాడి..దానితో సిబ్బంది పోరాటాలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి.

Latest News