Site icon vidhaatha

గన్ పార్క్ వద్ధ అమర వీరులకు సీఎం, మంత్రుల నివాళి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం చిరస్మరణీయమన్నారు. ఆమరుల ఆకాంక్షల సాధనకు తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. స్వరాష్ట్రంలో ప్రజాపాలనతో విశ్వవేదికపై తెలంగాణ సగర్వంగా నిలబడుతుందన్నారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందన్నారు.ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీతక్క నివాళులు అర్పించారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు.G

Exit mobile version