విధాత, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థలిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాళలర్పించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు.