పలు నమూనాల పరిశీలన
విధాత: రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను సీఎం రేవంత్ పరిశీలించారు. తుది నమూనాపై సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్‌ను టీఎస్ బదులుగా టీజీగా ఉపయోగిస్తున్నారు.
లెటర్ హెడ్స్ రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్‌లైన్ జీవోలు ఇతర అధికారిక వెబ్ సైట్లు ఆన్‌లైన్ జీవోల్లో టీజీగా మార్చారు. అటు రాష్ట్ర గేయంగా జయజయహే తెలంగాణ పై సైతం సీఎం రేవంత్‌రెడ్డి గేయ రచయిత అందేశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలతో చర్చలు జరిపారు. పలువురు మేధావులతో సైతం చర్చించి గేయానికి తుదిరూపు దిద్దారు.