Site icon vidhaatha

కల్వకుంట్ల వంశం కాదు కలవకుండా చేసే వంశం: సీఎం రేవంత్

Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 31(విధాత): తెలంగాణ శాసన సభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు బీసీలపాలిట గుదిబండలా మారాయన్నారు. ఆ చట్టంలో రిజర్వేషనల్లు 50శాతం మించకుండా చేశారని దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. 42శాతం బీసీల రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీలో గంగులకమలాకర్ ఒక్కడే సంతోషంగా ఉన్నారని సీఎం పేర్కొన్నారు. గంగుల కమలాకర్‌ను ఉద్దేశిస్తూ.. గంగుల మీ అధిష్టానానికి భయపడాల్సిన అవసరం లేదు.. మంచి చెడు ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని సీఎం మాట్లాడారు.

బీసీ రిజర్వేషన్ల అంశంలో కేటీఆర్, హరీష్ రావు కడుపు నిండా విషం పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లుతున్నారని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే బీఆర్ఎస్ మద్దతు తెలపలేదని విమర్శించారు. కల్వకుంట్ల వంశం కాదని, ఎవరినీ కలవకుండా చూసే వంశమని అన్నారు. బీసీలు, ఓబీసీలు కలవకుండా, ఎస్సీలు, ఎస్టీలను కలవకుండా చేసే వంశమని విమర్శించారు.

Exit mobile version