Site icon vidhaatha

CM Revanth Reddy | ఆగస్టు 3న అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

విధాత: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైనట్ల తెలిసింది. ఆగస్టు 3 న రాత్రి బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు బయలు దేరనున్నారు. తెలంగాణ లో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్లు అధికంగా ఉన్న డల్లాస్ తదితర రాష్ట్రాలలో ఆయన పర్యటించనున్నారు. సీఎం రేవంత్ అమెరికా పర్యటన వారం రోజుల పాటు ఉండనున్నది. సీఎం తన అమెరికా పర్యటనలో పలు కంపెనీల సీఈఓ లు, పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. ఆయన తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్ కు రానున్నారు.

Exit mobile version