Revanth Reddy | ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో తీన్మార్ మ‌ల్లన్న‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ - ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయ‌క‌త్వాన్ని ఆదేశించారు. ఇది తీన్మార్ మ‌ల్ల‌న్న ఎన్నిక మాత్ర‌మే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అని ఆయ‌న పేర్కొన్నారు.

  • Publish Date - May 23, 2024 / 09:04 AM IST

Revanth Reddy | హైద‌రాబాద్ : ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయ‌క‌త్వాన్ని ఆదేశించారు. ఇది తీన్మార్ మ‌ల్ల‌న్న ఎన్నిక మాత్ర‌మే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జూమ్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్లన్న‌తో పాటు ఈ మూడు ఉమ్మ‌డి జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్ల‌మెంట్ ఇంచార్జీలు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల‌ని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు క్రియాశీల‌కంగా ప‌ని చేయాల‌న్నారు. ఈనెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌ను సన్నద్ధం చేయాలి. ప్రతీ ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌ల‌ను సందర్శించాలి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారు. సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Latest News