ఫోన్‌ ట్యాపింగ్‌..డ్రగ్స్‌ నియంత్రణలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ఎట్టకేలకు సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా ట్యాపింగ్‌ కేసును సమీక్షించలేకపోతున్నానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి కోడ్‌ ముగిసిపోవడంతో ఈ అంశంపై సమీక్ష చేశారు

  • Publish Date - June 10, 2024 / 06:25 PM IST

నకిలీ విత్తనాల నివారణకు చర్యలు

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై ఎట్టకేలకు సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా ట్యాపింగ్‌ కేసును సమీక్షించలేకపోతున్నానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి కోడ్‌ ముగిసిపోవడంతో ఈ అంశంపై సమీక్ష చేశారు. సోమవారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో జరిగిన రెండు గంటల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ట్యాపింగ్‌తో పాటు డ్రగ్స్‌ , నకిలీ విత్తనాల వంటి అంశాలపై సమీక్ష చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ట్యాపింగ్‌ కేసు, డ్రగ్స్‌ నియంత్రణ, నకిలీ విత్తనాల నివారణ, ఇతర క్రైమ్‌ నివారణ చర్యల పురోగతిని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. అలాగే పోలీస్‌ శాఖలో చేపట్టాల్సిన ప్రక్షాళన చర్యలు, బదిలీల అంశంపై కూడా సీఎం చర్చించారు. అయితే అధికారికంగా ఈ సమీక్షా సమావేశానికి సంబంధించిన సమాచారం తెలియాల్సివుంది.

 

 

Latest News