Site icon vidhaatha

కూలిన గోడ…ఇద్దరు చిన్నారుల మృతి

విధాత, హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌రెడ్డి నగర్‌లో వర్షానికి తడిసిన గోడ కూలిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం బాలుడు నూర్ జాన్‌(8), ఆసీఫ్ ఫర్విన్‌(3) సహా నలుగురు చిన్నారులు పాత గోడ పక్కన ఆడుకుంటున్న క్రమంలో వర్షానికి నాని ఉన్న పాత గోడ ఒక్కసారిగా కూలి చిన్నారులపై పడింది. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబం బీహార్ నుంచి వచ్చి స్థానిక పారిశ్రామిక వాడలో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఎస్సై మధు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Exit mobile version