విధాత: హుజూరాబాద్ నియోజకవర్గంలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఇల్లందకుంట మండలం సిరిసేడులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ర్యాలీ నిర్వహించగా.. ర్యాలీని తెరాస కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఒకరిపైఒకరు దూసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ క్రమంలో పోలీసులపై ఒకరు చేయిచేసుకోవడం గమనార్హం. కాగా, ఘర్షణపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.