విధాత, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తామనే అంశాలను ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ‘న్యాయ్ పత్ర’ పేరుతో లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి కొత్తగా రాష్ట్రానికి సంబంధించి లోక్ సభ ఎన్నికల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేస్తుండటంతో అందులో ఏయే అంశాలుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
నేడు తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యానిఫెస్టోను ఆవిష్కరించనున్నారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు