Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి జీవిత భాగ‌స్వామితో ఘ‌ర్ష‌ణ‌లు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టుదల, ఏకాగ్రతతో పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది. కీలక విషయాల్లో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కోపాన్ని అదుపు చేయకపోతే అనర్ధాలు కలగవచ్చు. ధార్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా ఫలితాలు మాత్రం నిరాశ పరుస్తాయి. ప్రణాళికబద్ధంగా లేకపోతే ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి అనువైన సమయం కాదు. ప్రయాణంలో ఆటంకాలు ఉండవచ్చు కాబట్టి వాయిదా వేస్తే మంచిది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయ సూచనలున్నాయి. తలపెట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కార్యసిద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయి. ధనవస్త్ర లాభాలున్నాయి. పరోపకార పనులతో కీర్తి పెరుగుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శుభకార్యాల్లో కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో పాల్గొంటారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లంతా సందడి నెలకొంటుంది. దైవబలంతో లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. వృత్తి పరంగా ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే అదృష్టం సొంతమవుతుంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పనిచేస్తే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో ఆటంకాలు అధిగమిస్తారు. ధనాదాయ మార్గాలు మెరుగు పడతాయి. కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఉండవచ్చు. జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. భూమి, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. పదోన్నతికి అవకాశం ఉంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. వ్యాపారంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. సోదరులతో, సంబంధీకులతో అనుబంధం దృఢ పడుతుంది. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పలు మార్గాల నుంచి ధనలాభాలు ఉంటాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు, సహనం అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సంపూర్ణకార్యసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో స్వల్ప ప్రయత్నంతోనే విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంతో పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రణాళిక వేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. ప్రారంభించిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. భూ, గృహ, ధనధాన్య లాభాలున్నాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. చక్కని ప్రణాళికతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికంగా మేలైన సమయం. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం ఆనందం కలిగిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం అనుకూలిస్తోంది కాబట్టి అన్ని రంగాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. స్థిరాస్తి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి.

Latest News