Site icon vidhaatha

కాంగ్రెస్‌కు కార్య‌క‌ర్త‌లే బ‌లం- ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

విధాత,హైదరాబాద్‌: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పని చేసిన కార్యకర్తలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ రేవంత్‌, కొత్త కమిటీకి అభినందనలు చెప్పారు. పోలీసుల వేధింపులను కూడా తట్టుకొని నిలబడ్డ ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
సుదీర్ఘ కాలం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండకపోయినా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, క్షేత్ర స్థాయిలో, సంస్థాగతంగా పార్టీ బలమే కార్యకర్తలని గుర్తుచేశారు. కార్యకర్తల చెమటతోనే ఇన్నాళ్లు పార్టీ నిలబడిందని ఉత్తమ్ తెలిపారు.

Exit mobile version