Cotton | విధాత, ప్రత్యేక ప్రతినిధి : కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఈ నెల 6 వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్ళ నిరవధిక బంద్ ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ బుధవారం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ కాటన అసోసియేషన్ అధ్యక్షునితో మాట్లాడినట్లు తెలిపారు. ప్రభుత్వానికి సహకరించి మంత్రి మాటపై మీయొక్క “నిరవధిక బందును” వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. మీ సమస్యలన్నింటిపై కేంద్ర ప్రభుత్వానికి పాజిటివ్ గా లేఖను రాశామని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడినట్లు వివరించారు. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీహార్ ఎలక్షన్లలో బిజీగా ఉన్నందున తొందర్లోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మంత్రి తుమ్మలను కలవటానికి తెలంగాణ స్టేట్ కాటన్ అసోసియేషన్ డెలిగేట్స్ వస్తే కలిపిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. CCI బ్రాంచ్ మేనేజర్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు రోజులలో CCI కొనుగోలు కేంద్రాలను 75% ఇండస్ట్రీస్ ఓపెన్ చేస్తామని మిగతావి కేంద్రమంత్రి ఆదేశాలనుసారం తప్పకుండా అన్ని ఇండస్ట్రీస్ ను ఓపెన్ చేస్తామని చెప్పినట్లు వివరించారు.
ఈ విషయాలపై తెలంగాణ స్టేట్ కాటన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వముతో కలిసి వెళితేనే మన సమస్యలు పరిష్కారమవుతాయని భావించి నిరవధిక బందును కొద్ది రోజులు వాయిదా వేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. తర్వాత సమస్యలు పరిష్కారం కానిచో మళ్ళీ బంద్ కు వెళ్లాలని కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు బంద్ ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించాని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
