Site icon vidhaatha

Chada Venkat Reddy | కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మొండి చే యి .. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి

విధాత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేసి చూపించిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయాన్ని చేశారన్నారు. ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా చెల్లించకుండా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారని కానీ మోదీ సర్కారు మాత్రం తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదన్నారు. ఆంధ్ర, బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజీ ఇస్తే హర్షించదగ్గ పరిణామం కానీ తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపించారని ప్రశ్నించారు. పెన్షన్లు, ఆదాయపన్ను స్లాబ్ రేట్లు తూతు మంత్రంగా ప్రవేశపెట్టినా, నిత్యవసర ధరలు, గ్యాస్ ధరలు పెరుగుపోయిన తరుణంలో వాటికి ఉపశమన మార్గాలు చేయలేదన్నారు. తెలంగాణకు ఒక సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కూడా ఇవ్వలేదని, కనీసం నిధులు కేటాయించలేదని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పక తప్పదని చాడ హెచ్చరించారు.

Exit mobile version