Site icon vidhaatha

రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌

అధికారులకు సూచనలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరిశీలించారు. అవతరణ వేడుకలు నిర్వహించనున్న పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం గౌరవ వందనం స్వీకరించే..సందేశమిచ్చే వేదికతో పాటు, ఆహుతులకు సీటింగ్ ఏర్పాట్లు..పరేడ్ రిహార్సల్‌ను శాంతికుమారి పరిశీలించి సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అటు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే కార్నివాల్ కు సంబంధించిన ఏర్పాట్లను కూడా సీఎస్ సమీక్షించారు.

Exit mobile version