ఎస్సీ సంక్షేమానికి కేటాయింపులు రూ. 21,072 కోట్లు
ఖర్చు చేసింది రూ. 2,265 కోట్లే
ఇళ్ల నిర్మాణానికి 13,428 కోట్లు
ఖర్చు కేవలం రూ.1,723 కోట్లు మాత్రమే
ప్రాధాన్య రంగాలకు భారీ కోత పెట్టిన గత సర్కార్
విధాత: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ కులాల అభివ్రుద్ది కోసం రూ. 21,072 కోట్లు కేటాయింపులు చేసిన ప్రభుత్వం కేవలం రూ. 2,265 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇలా బడ్జెట్ అంచనాలను వాస్తవ కేటాయింపులకు మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో బడ్జెట్ లక్ష్యాలు నెరవేరలేదన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది. వాస్తవంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,90, 396 కోట్ల బడ్జెట్ అంచనా వేశారు. సవరించిన అంచనాలు పరిశీలిస్తే రూ, 58,379 కోట్లు తగ్గి రూ.2, 32,017 కోట్లుగా ఉంది. దీంతో గత ప్రభుత్వ ప్రాధాన్యాలైన దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం కేటాయించిన నిధులకు భారీ కోత విధించింది.
ఈ మేరకు గ్రుహ నిర్మాణానికి రూ. 13, 428 కోట్లు కేటాయించి ఖర్చు మాత్రం కేవలం రూ. 1,723 కోట్లు మాత్రమే చేశారు. ఇలా ఒకటి రెండు మినహా అన్ని శాఖల పద్దుల్లో కోత విధించారు. ఫలితంగా దాదాపు రూ.58 వేల కోట్ల పైచిలుకు బడ్జెట్ అంచనాల్లో కోత పడింది. కేంద్ర గ్రాంట్ల లో భారీగా తగ్గుదల ఏర్పడిందని బడ్జెట్ పద్దుల వివరనాత్మక నివేదిక స్పష్టం చేసింది. దీంతో రెవెన్యూ వ్యవయం రూ. 2,11,685 కోట్లుగా ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం కేవలం రూ. 1,69,141 కోట్లకే సవరించచుకోవాల్సి వచ్చింది. పెట్టుబడి వ్యవయం కూడా రూ.37,524 కోట్ల నుంచి రూ. 24,178 కోట్లకు తగ్గింది.