Warangal | దళిత బంధులో అవినీతి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: MSP నేత‌లు

Warangal హనుమకొండలో ఎం ఎస్ పి నిరస‌న దీక్ష మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ గవర్నర్ స్పందించాలని డిమాండ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దళిత బంధు పథకంలో (BRS MLA) బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ ఏకశిలా పార్క్, బాలసముద్రం వద్ద మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మహాజన సోషలిస్టు పార్టీ (MSP), MRPS, MSF మరియు అన్ని అనుబంధ […]

  • Publish Date - May 2, 2023 / 05:35 AM IST

Warangal

  • హనుమకొండలో ఎం ఎస్ పి నిరస‌న దీక్ష
  • మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు రాజేందర్
  • గవర్నర్ స్పందించాలని డిమాండ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దళిత బంధు పథకంలో (BRS MLA) బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ ఏకశిలా పార్క్, బాలసముద్రం వద్ద మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

మహాజన సోషలిస్టు పార్టీ (MSP), MRPS, MSF మరియు అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య‌క్షులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మంద కుమార్ మాదిగ, నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన MLA వివరాలను బహిరంగ పరచాలని, వారిని వెంటనే బహిష్కరించాలని, MLA లు లంచంగా తీసుకున్న డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని అన్నారు. దళిత బంధులో అవినీతి చేసారని ఆ చిట్టా తన వద్ద ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా హైకోర్ట్ స్వీకరించాలని, ఈ పథకంలో అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర గవర్నర్ తెప్పించుకొని గవర్నర్ కున్న అధికారాల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

చర్యలు చేపట్టే వరకు ఆందోళన

అవినీతిపరులపై చర్యలు తీసుకునే వరకు ఈ నెల 9 వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని 10 వ తేది వరకు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మీరు చేస్తున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని మీతో కలిసి పోరాటం సాగిస్తామని అన్నారు.

కార్యక్రమంలో ఎంఎస్పి, కాంగ్రెస్ నాయకులు నల్ల సత్యనారాయణ, (MSP), MRPS, MSF, అన్ని అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి.

Latest News