Warangal | ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా… నిర‌స‌న‌లు చేయాల‌ని పిలుపు

Warangal ఈనెల 15న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయండి తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ పిలుపు విధాత: ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నెల15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌(Telangana Kisan Congress) పిలుపు ఇచ్చింది. రైతులు, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్‌ […]

  • Publish Date - May 12, 2023 / 12:33 AM IST

Warangal

  • ఈనెల 15న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయండి
  • తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ పిలుపు

విధాత: ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ నెల15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌(Telangana Kisan Congress) పిలుపు ఇచ్చింది. రైతులు, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్‌ అన్వేష్ రెడ్డి సుంకేట ఒక ప్రకటన విడుదల చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెంటనే కొనుగోళ్లు మొదలు పెట్టాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వం తన తీరు మార్చుకోక పోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోళ్లు చేయాలన్నారు. అలాగే తరుగు పేరు మీద క్వింటాలుకి 10 కిలోల వరకు తీయడాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే మొదలు పెట్టాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తడిసిన ధాన్యం, మక్కలు కొంటాం అని ప్రకటనలు ఇస్తున్నారు త‌ప్ప లిఖితపూర్వ‌క‌ ఆదేశాలు ఇవ్వడం లేదన్నారు. మొక్క జొన్నలు కొంటామని ఎక్కడా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మొదట్లో రూ.2200 పలికిన మొక్కజొన్నను ఇప్పుడు దళారులు రూ.1400కే కొంటున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీ జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం మౌనంగా ఉంటుందన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి పలు డిమాండ్లు తెలిపారు.

1. తూకం వేయగానే రైతుకు ట్రాక్ షీట్ ఇవ్వాలి.
2. మిల్లర్లతో రైతులకు ఎటువంటి సంబంధం ఉండకూడదు.
3. రైతుకు ఇచ్చిన ట్రాక్ షీట్ ఆధారంగానే డబ్బులు ఇవ్వాలి.
4. కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి రైతులు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలి.
5. గతంలో రైతులకు రావాల్సిన డబ్బులకు తక్కువ వచ్చినవి అప్పుడు ఆధారాలతో ఇచ్చినా ఏ ఒక్కరికి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మిల్లర్లు కట్ చేస్తున్నారు. దీని మీద విచారణ జరిపి బాధ్యులైన అధికారుల మీద, మిల్లర్ల మీద చర్యలు తీసుకొని రైతులకు తగ్గించిన డబ్బులను వెంటనే రైతులకు చెల్లించాలి.

6. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి.
7. పొలం మీదనే పంట చేతికిరాని రైతులకు, కోసిన పంట కొనుగోలు కేంద్రాలకు రాకుండానే నష్టపోయిన రైతులకు, పంట తడిసి, తేమ పెరిగి, మొలకలు వచ్చిన పంట ను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదా వర్షానికి తడిసిన ధాన్యాన్ని, మొక్కజొన్న పంటలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించాలి.
8. రుణాలను రీషేడ్యుల్ చెయ్యాలి. రుణ మాఫీ అమలు చెయ్యాలి.

Latest News