Site icon vidhaatha

Jagdish Reddy | మోడీ పాలనపై తిరుగుబాటు ఆరంభం: మంత్రి జగదీష్ రెడ్ది

Jagdish Reddy

విధాత: ప్రధాని మోడీ పాలనపై తిరుగుబాటు మొదలైందని కర్ణాటక ప్రజల తీర్పు ఇందుకు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన వెలి మినేడు ఆంజేయస్వామి ఆలయంలో పూజల అనంతరం ఆయన స్ధానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రజల తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కర్ణాటక ప్రజలు ఈ ఎన్నికల్లో మోడీకి చూపించారని ఆయన ఎద్దేవా చేశారు. తొమ్మిది రాష్ట్రాలలో అనైతికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర మోడీదని ఆయన ధ్వజమెత్తారు.

ప్రజల తీర్పును ఖాతరు చెయ్యకుండా అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన దుర్మార్గం బిజేపి దని ఆయన మండిపడ్డారు. అందుకే కన్నడ నాట ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఆయన విరుచుకుపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపికి గుణపాఠం చెప్పేందుకు యావత్ భారతావని సన్నద్ధం అవుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి(Jagdish Reddy)హెచ్చరించారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు స్థితికి చేరుకుందన్నారు. ప్రజలు అధికారాన్ని అప్పగించినా నిలబెట్టుకోలేని దుస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందన్నారు.

Exit mobile version