Jagadish Reddy | 2 వారాల్లో సమీకృత కలెక్టరేట్ పూర్తి చేయాలి.. లేదంటే చర్యలు

Jagadish Reddy అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆల్టిమేటం విధాత: సూర్యాపేటలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయం నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు వారాల వ్యవధిలో పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని ఆయన అధికారులకు ఆల్టిమేటం జారీచేశారు. మంగళవారం సాయంత్రం ఆయన జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులలో జరుగుతున్న అలసత్వం […]

  • Publish Date - May 16, 2023 / 03:18 PM IST

Jagadish Reddy

  • అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆల్టిమేటం

విధాత: సూర్యాపేటలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయం నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు వారాల వ్యవధిలో పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని ఆయన అధికారులకు ఆల్టిమేటం జారీచేశారు.

మంగళవారం సాయంత్రం ఆయన జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులలో జరుగుతున్న అలసత్వం పై ఆయన అధికారుల మీద మండిపడ్డారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న హెలిపాడ్ నిర్మాణంలో చెయ్యాల్సిన మార్పులను ఆయన సూచించారు. అదే విధంగా గ్రీనరీ సుందరీకరణ ఎలా ఉండాలో ఆయన అధికారులకు వివరించారు.

ఎలక్ట్రికల్, ప్లాంటేషన్, ప్లంబర్ వర్క్స్, చుట్టూ ప్రహరీ గోడ వంటి పనులకు రోజుకు 50మంది చొప్పున పనివారిగా అదనంగా నియమించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సుమారు 50కోట్లతో నిర్మితమౌతున్న కలెక్టర్ కార్యాలయ భవానాల సముదాయాలను ఆయన పరిశీలించారు.

మంత్రి జగదీష్ రెడ్డి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్&బి యస్ ఈ నరసింహ, ఈఈ యాఖూబ్, తాహ‌సిల్దారు ఎంకన్న, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డిఎస్పి నాగభూషణం తదితరులు ఉన్నారు.

Latest News