జనగామ కలెక్టరేట్లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం .. ఈ మధ్యలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నం

తన భూ సమస్య పరిష్కారం పట్ల చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ కలెక్టరేట్లో సోమవారం ఓ మహిళా ఆత్మహత్యకు యత్నిచిన సంఘటన జరిగింది.

  • Publish Date - July 1, 2024 / 03:25 PM IST

విధాత, వరంగల్ ప్రతినిధి:తన భూ సమస్య పరిష్కారం పట్ల చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ కలెక్టరేట్లో సోమవారం ఓ మహిళా ఆత్మహత్యకు యత్నిచిన సంఘటన జరిగింది.ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం ఎక్కి సూసైడ్ అట్మెo ట్ చేశాడు. ఆ సంఘటన మరవక ముందే తాజాగా జనగామ జిల్లా నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన వ్యవసాయభూ సమస్య విషయమై కలెక్టరేట్ కు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగించింది. భూ వివాదంతో జ్యోతి గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా, పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది సోమవారం కలెక్టరేట్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే అప్పటికే ఇంటివద్ద నిద్ర మాత్రలు మింగి ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి జ్యోతి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News