కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల నిరసన
విధాత, వరంగల్ ప్రతినిధి: కేంద్రప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాలలో దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అవసరం లేదని ట్విట్టర్ వేదికగా సీనియర్ ఐఏయస్ అధికారి స్మితా సభర్వాల్ వాఖ్యానించడం సరికాదని దేవా సంఘం జిల్లా అధ్యక్షులు బిల్ల మహేందర్ అన్నారు.
ఐఏయస్ అధికారి స్మితాసభార్వాల్ వ్యాఖ్యలకు నిరసిస్తూ సోమవారం హన్మకొండ కలెక్టర్ కార్యాలయం దగ్గర దివ్యాంగుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా స్మీతా సభర్వాల్ వాఖ్యానించడం సబబు కాదనీ , ఎందరో దివ్యాంగులు వారి వైకల్యాన్ని జయించి విజయాలు సాధించడాన్ని గమనించకపోవడం సిగ్గుచేటని మహేందర్ అన్నారు.
ఈ విషయంపై కేంద్రప్రభుత్వం వెంటనే స్పందించి 2016దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జిల్లా బాధ్యులు నున్న నరసమ్మ, బోనగిరి రాములు, ఏ.కుమారస్వామి, మహ్మద్ ఫసిఉద్దీన్, పొలస ని వెంకన్న, లింగుదారి రాజేశ్వరావు, శ్రీనివాసు, తిరుపతిరావు, చందు తదితరులు పాల్గొన్నారు.